మొటిమలు ఎందుకు వస్తాయి?
మన జుట్టు మరియు చర్మం మృదువుగా వుండటానిగి, మన శరీరం sebum అనే natural oil ని తయారుచేస్తుంది. మన చర్మం బయట పొరలో వుండే కణాలు (cells) ఎప్పుడు రాలిపోతూ, వాటి స్థానంలో క్రొత్తవి వస్తుంటాయి. [అందుకే face creams మీ రంగును శాశ్వితంగా మార్చలేవు]
teenage లో హార్మోన్స్ లెవెల్స్ మారుతూ ఉండటం వలన, ఈ natural oil ఎక్కువగా తయారు అవుతుంది. ఇది చర్మం నుండి రాలిపోయిన cells తో కలిసి, ముఖం మీద వున్న రంద్రాలు block అయ్యేలా చేస్తుంది. అందరి శరీరంలో C. acnes అనే బాక్టీరియా ఉంటుంది. ఇది ఈ natural oil తిని బతుకుతుంది. Block అయినా రంద్రాలలో చేరి infection వచ్చేలా చేస్తుంది. అదే మనకు మొటిమలలా కనిపిస్తుంది.
మొటిమలను ఎలా తగ్గించుకోవాలి?
హార్మోన్ మందులు వాడటం ద్వారా natural oil ఉత్పత్తి తగ్గించి మొటిమలు తగ్గించవచ్చు. కానీ హార్మోన్స్ మెడిసిన్ కి చాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వలన ఇది మంచిది కాదు.
Antibiotics
antibiotics, మొటిమల బాక్టీరియా ని చంపి మొటిమలను తగ్గించగలవు. కానీ ఇవి నోటిద్వారా తీసుకుంటే మనకి ఉపయోగకరమైన బాక్టీరియా కూడా చంపి మంచికంటే చేడు ఎక్కువ చేస్తాయి. ముఖానికి నేరుగా face cream, soap రూపంలో వాడాలి.
Salicylic acid, Azelaic acid అనే antibiotics మొటిమల బాక్టీరియా కి బాగా పనిచేస్తాయి. మొటిమల కోసం చేసిన చాలా face creams, soaps లో వీటిని వాడుతారు. Ingredients లిస్ట్ చూసి, అలాంటి వాటిని ఒకటి వెతికి వాడండి.
చాలా creams, soaps వేప, తులసి, వంటివి వాడి చేసిన natural ప్రోడక్ట్ అని చెప్పి ఎక్కువ ధరకి విక్రయిస్తారు. వాస్తవానికి అవికూడా చాలావరకు Salicylic acid లేదా ఇతర కృత్రిమ antibiotics నే వాడుతాయి. ingredients లిస్ట్ చుడండి, మోసపోకండి.
Antibiotics తో వచ్చే సమస్యలు
- antibiotics కొంత కాలం తరవాత పని చెయ్యకపోవచ్చు, ఎందుకంటే bacteria వాటికి అలవాటు పడే అవకాశం వుంది
- Face creams, soaps లో హాని కరమైన రంగులు, ప్రిజర్వేటివ్స్, సెంట్స్ వాడటం వలన చర్మానికి ప్రమాదం కలిగే అవకాశం వుంది
తేనె ద్వారా మొటిమలకు పరిష్కారం
Original తేనె కి మొటిమల బాక్టీరియా ని చంపే శక్తి వుంది. ముఖం శుభ్రం చేసుకొని, తేనె ని మాత్రమే ముఖానికి అప్లై చేసి 30 నిముషాలు ఉంచి కడగండి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే వారం రోజుల్లో చాలా వరకు మొటిమలు తగ్గిపోతాయి.
తేనె ఎలా పనిచేస్తుంది
- తేనె, మైక్రోబ్స్ లో వున్న తేమని పీల్చుకొని అవి చనిపోయేలా చేస్తాయి
- తేనెలో వున్న enzymes, గాలి తగిలినప్పుడు ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి
- తేనెలో, పువ్వుల ద్వారా వచ్చిన ఎన్నోరకాల సహజ సిద్ద compounds ఉంటాయి
పై కారణాల వల్ల, మైక్రోబ్స్ ఇందులో బతకలేవు, అందుకే original తేనె ఎప్పటికి చెడిపోదు. ఇవే కారణాల వల్ల, ముకానికి అప్లై చేసినప్పుడు, బాక్టీరియా చనిపోయి, మొటిమలు తగ్గిపోతాయి. తేనెలో ఎన్నో కాంప్లెక్స్ కంపౌండ్స్ కలిసి పనిచేయటం వలన, బాక్టీరియా దీనికి అలవాటు పడదు. స్వచమైన తేనెలో ఎటువంటి కృత్రిమ రంగులు, రసాయనాలు, సెంట్, కెమికల్స్ వుండవు.
చాలా పెద్ద కంపెనీలు, తేనె ని బాగా వేడి, ఫిల్టర్, రసాయన శుద్ధి చేసి రంగులు కలపటం వలన తేనె సహజ స్వభావం కోల్పోతుంది. అందుకే నమ్మకం వున్న చోట సేకరించిన తేనె ఉపయోగించండి.
రచయిత
Karthik Kotturu, No Mix Kart .com వ్యవస్థాపకుడు, IIM Trichy లో MBA పూర్తీ చేసారు. ఈ వెబ్సైటు కి కావల్సిని నాణ్యమైన ప్రొడక్ట్స్ కోసం చేసిన రీసెర్చ్ తో వచ్చిన అనుభవం తో, ఈ వెబ్సైటు మరియు Quora లో ఆర్టికల్స్ వ్రాస్తుంటారు.
రచయిత ప్రొఫైల్ చుడండి: